లాక్ డౌన్ కారణంగా ఆర్దికంగ పేద ప్రజలను అదుకోవడానికి కేంద్రప్రభుత్వమ్ జన్ ధన్ ఖాతాల్లో మూడు నెలల పాటు రూ.500 జమ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం చెప్పిన విదంగానే దేశంలో ఉన్న జన్‌ధన్ ఖాతాలకు పీఎంజీకేవై కింద డబ్బు జమ చేసింది. అదే విధంగా తెలంగాణాలో కూడా దాదాపుగా 3 లక్షల జన్‌ధన్ ఖాతాలకు పీఎంజీకేవై కింద డబ్బులు జమ చేసింది.
కానీ జమ చేసిన కొన్ని రోజులకే మళ్ళీ వారి ఖాతా నుండి జమ చేసిన రూ.500 వెనక్కి తీసుకున్నారు. తెలంగాణ మొత్తంలో రూ.16కోట్లను తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది. 2014 ఆగస్ట్ 1 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చామని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేశ్ తెలిపారు. అందువల్ల దాదాపు 5,15,260 మంది మినహా మిగతా ఖాతాదారులను అనర్హులుగా తేల్చి వారికి జమ చేసిన మొత్తం ను వెనక్కు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే దాదాపు ఒక లక్ష మంది ఖాతాదారులు 500రుమాయాలను జమ ఆయిన వెంటనే తీసుకున్నారని వారి దగ్గర నుండి కూడా డబ్బు రాబట్టే ప్రయత్నం చేస్తునట్లు తెలిపారు.