Saturday, May 15, 2021

Latest Posts

ఎత్తుకు పైఎత్తు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఏపీ,తెలంగాణ మధ్య కృష్ణ జలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. శ్రీశైలం జలాశయం ఎగువన రాయలసీమకు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇవ్వడానికి జగన్ సర్కార్ తెచ్చిన జీవో 203 పెద్ద దుమారం రేపుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు దగ్గర మరో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, ప్రాజెక్టుకు ఎగువ భాగాన 15 నుంచి 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నిర్మాణంపై ప్రభుత్వం నిపుణుల నుంచి నివేదిక కోరింది. ఈరోజు (మే 17) ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గోదావరి జలాలపై జరుగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ ప్రాజెక్టు విషయంపై చర్చించినట్లు తెలుస్తుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss