Sunday, June 20, 2021

Latest Posts

తెలంగాణా లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించిన కే‌సి‌ఆర్

Telangana Lockdown

రోజు రోజుకు కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, బుధవారం ఉదయం 10 గంటల నుండి మే 12 వరకు 10 రోజులు పాటు లాక్డౌన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిది. ఈ రోజు జరిగిన కాబినెట్ మీటింగ్ లో ఈ విషయాన్ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

ప్రతిరోజూ ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని కేబినెట్ నిర్ణయించింది. తరువాత రోజంతా లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పింది. అంతే కాకుండా కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.

లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పట్టలేదని ఇంతక ముందు కే‌సి‌ఆర్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని తెలుస్తుంది. రాష్ట్రంలో కేసులు తగ్గడానికి కే‌సి‌ఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందని మరో సారి హై కోర్టు నిలదీయడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss