Tuesday, April 13, 2021

Latest Posts

మహా సరిహద్దులు మూసేసిన టి సర్కార్  

Telangana may close borders with Maharastra, says CM KCR

దేశంలో అత్యధికంగా కరోనా కేసులతో అట్టుడికి పోతున్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. ఐటీ e మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎలెర్ట్ అయింది.  ఆ రాష్ట్ర సరిహద్దును పూర్తిగా మూసేసి, కాలినడకన వచ్చే వారిని కూడా తెలంగాణలోకి రానివ్వకుండా సరిహద్దులోని గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడి ప్రజలు  తమ గ్రామాల సరిహద్దుల్లో ముళ్లకంపలు, కందకాలు తవ్వుతున్నారు. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి కూడా గొత్తికోయల వలసలు పెరగకుండా అధికారులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నల్లమలలోకి ఆగస్టు దాకా పర్యాటకులను అనుమతించబోమని, కఠిన  నిబంధనలు అమల్లో ఉంటాయని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఫారెస్టు అధికారి జోజి తెలిపారు. లాక్‌డౌన్‌తో పాటు, అమ్రాబాద్‌ అభయారణ్యంలో పులుల ప్రసవ సమయం కూడా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా   హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో  తాజాగా మరో వ్యక్తి ఆస్పత్రి నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో నాలుగు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే తాను ఆస్పత్రిలో ఉండలేనని, ఇంటికి వెళ్లిపోతానని ఆస్పత్రి సిబ్బందితో అతడు వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది లేని సమయంలో ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డులు గమనించి, తిరిగి వార్డుకు పంపించారు. ఇలా పారిపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఇక   కరోనాపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అవగాహన కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ యువకుడు కరోనా మహమ్మారిని ఎలా నియంత్రించాలనే ఆలోచనతో విచిత్ర వేషధారణతో అవగాహన కల్పించారు. కరోనా వైరస్ తీరులో వేషధారణ చేసుకుని రోడ్లపై వచ్చే వారందరినీ అడ్డుకున్నారు. మీతో తీసుకువెళ్లాలంటూ భయపెట్టారు. అయితే వైరస్ తరహా వేషధారణతో అవగాహన కల్పిస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే రేగా కాంతారావు అభినందించారు. అనంతరం శానిటైజర్ రాసుకుంటే వైరస్ ఎలా పారిపోతుందో కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా మలికిపురం యముడు,చిత్ర గుప్తుడు వేషధారణలతో  ఎస్ ఐ నాగరాజు ప్రజల్లో అవగాహన కల్పించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss