Thursday, December 2, 2021

Latest Posts

నన్ను రా ఓరేయ్ అన్న నేను గౌరవంగానే పిలుస్తా – హరీశ్ రావు

Telangana minister Harish rao counter to etela rajendar

తెలంగాణాలో హుజురాబాద్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఈ రోజు టి.ఆర్.ఎస్ అబ్యార్దిని కెసిఆర్ ప్రకటించారు. కాగా ఈ రోజు మంత్రి హరీష్ రావు హుజురాబాద్ లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పై నిప్పులు చెరిగారు. ఈటెల ఓటమి భయంతోనే మాట్లాడుతున్నారని. ‘బీజేపీలోకి వెళ్లిన ఈటల కొత్త భాష నేర్చుకుని, తండ్రి లాంటి కేసిఆర్ ను  రా అని తనను ఓరేయ్ హరీశ్ అని సంబోధిస్తున్నారు. రాజకీయ ఓనమాలు నేర్పి, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చిన కేసిఆర్ అలా సంబోధించడం సరైంది కాదు  అన్నారు. ఈటల ఎలా సంబోధించిన  తాము మాత్రం రాజేంద్రాన్నఅని గౌరవంగా పిలుస్తామని తెలిపారు. అలాగే హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకే లాభమని హుజురాబాద్ లో అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి అన్నారు. వ్యక్తి ప్రయోజనమా, హుజురాబాద్ ప్రజల ప్రయోజనమా అన్న దానిపై చర్చ పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ఈటేల ఇలా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ అన్నారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss