త్వరలో పంచాయితీ శాఖ కార్యదర్శుల ఖాళీలు భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయితీ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా పంచాయితీ శాఖ కమిషనర్ మరియు కలెక్టర్లు ఈ ఆదేశానుసారం కార్యాచరణను సిద్ధం చెయ్యనున్నారు.
అన్నీ కుదిరితే ఈ వారంలోనే పంచాయితీ శాఖ కార్యదర్శుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చెయ్యనున్నారు. ఈ నోటిఫికేషన్ పక్రియ జిల్లాలవారిగా జరగనుంది. అయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 2000 కు పైబడి పంచాయితీ శాఖ కార్యదర్శుల ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వం తెలియచేసింది. పంచాయితీ శాఖ కార్యదర్శుల జీతం 15 రూ. గా తెలుస్తుంది. వీటికి గాను త్వరలో పోస్టుల భర్తీ జరగనున్నట్టు తెలిపింది పంచాయితీ శాఖ.
ఇది కూడా చదవండి: