Sunday, March 7, 2021

Latest Posts

తెలంగాణలో మాస్క్ లేని వారిని గుర్తించేందుకు కొత్త టెక్నాలజీ

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో లాక్ డౌన్ ను ప్రవేశపెట్టారు. దాంతో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఎంత చెప్పిన ఆకతాయిలు రోడ్ల  పైకి రావడం ఎక్కువ అవుతుంది. వచ్చిన ఏదో కారణం చెప్పడం మొదలుపెట్టారు. వచ్చినవారు మాస్క్ లేకుండా  రావడం వల్ల వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలోనే మాస్క్ లేకుండా రోడ్డెక్కితే భారీ జరిమానా కూడా  విధించనుంది. అంతేకాకుండా రోడ్డుపైకి  మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు.

సీసీటీవీ థర్డ్ ఐ, ఏఐ బేస్డ్ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నారు. త్వరలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్లలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ఎన్నిసార్లు మాస్కులు లేకుండా తిరిగితే అన్ని సార్లు రూ. 1000  జరిమానా చెల్లించాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.అయితే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు కావడంతో లాక్ డౌన్ చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss