Telangana promulgates ban on spitting in public places
తెలంగాణ లో లాక్డౌన్ను పక్కాగా అమలు చేయాలని, ఎక్కువ మంది గుమ్మి కూడవద్దని, సామాజిక దూరం పాటించాలని ఇలాంటివి ఎన్నో మంచి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తునది. ఐనా కరోనా రోజురోజుకూ విజృంబిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో వ్యక్తిగత శుభ్రత తో పాటు సామాజిక పరిశుభ్రత తప్పనిసరి అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకూనట్లు ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. అది ఏమిటనగా “ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నేరంగా పరిగణిస్తామని”.
ఇకపై రోడ్లు, పబ్లిక్, ప్రైవేటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మి వేయడం వల్ల వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం అందువల్ల ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్, లేదా ఉమ్మి వేయడం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నాం’ అని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.