Wednesday, June 23, 2021

Latest Posts

తెలంగాణా కరోనా వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 1,539 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,45,682 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు 1362 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,656 ఉన్నాయి. వారిలో 15,864 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,25,664 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తెలంగాణాలో రికవరీ రేటు 91.85% శాతంగా ఉండగా ఇండియా రికవరీ రేటు 92.2% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.55%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 44,327 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 44,84,183 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 285 కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss