తెలంగాణలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. ఈ రోజు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1602 కేసులు నమోదుకాగా, కరోనాతో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,47,284 కరోనా కేసులు నమోదుకాగా, మొత్తం మరణాల సంఖ్య 1366కి చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,26,646 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,272 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఈ రోజు నమోదు అయ్యిన కొత్త కేసుల వివరాలు జిల్లాల వారిగా భద్రాద్రి కొత్తగూడెంలో 77, జీహెచ్ఎంసిలో 295, కరీంనగర్ లో 76, ఖమ్మంలో 79, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 137, నల్గొండలో 79, రంగారెడ్డిలో 118 కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: