తెలంగాణలో కరోనావైరస్ కొత్త కేసులు సంఖ్య మళ్లీ నిన్న తగ్గాయి. ఆదివారం కావడం వల్ల తక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడంతో తాక్కువ కేసులు నమోదు అవ్వుతున్నాయి. కాగా ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ లో అది తెలుస్తుంది. కాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23,806 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిగా వాటిలో కొత్తగా 857 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,51,188కు చేరుకున్నాయి. 1,504 మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీ కేసులు 2,30,568కు పెరిగాయి. కాగా మరో నలుగురు కరోనతో మృతిచెందటంతో ఇప్పటివరకు 1381 మంది కరోనా బారినపడి మృతి చెందారు. మరోవైపు.. కరోనా మరణాల శాతం దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి తగ్గిందని.. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 92.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 91.79 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 16,449 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు..
ఇది కూడా చదవండి: