Home TRENDING తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,65,049కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందటంతో మృతుల సంఖ్య 1,437కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,097 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,52,565కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,047 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 8,720 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 52,01,214కి చేరింది.

ఇది కూడా చదవండి:

Exit mobile version