Thursday, December 2, 2021

Latest Posts

స్వతంత్ర దినోత్సవం రోజున రుణమాఫీ ప్రకటించనున్న సీఎం

Telangana rythu runa mafi 2021

తెలంగాణాలో ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు జమకానున్నట్లు  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొన్ని రోజుల క్రితమే  రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు నగరంలోని బీఆర్‌కేఆర్ భవన్‌లో బ్యాంకర్లతో సమావేశం ఈ విషయమే చర్చించారు. సమావేశ అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు రైతు రుణ మాఫీపై సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

కాగా సీఎం కేసీఆర్ ఆగష్టు 15 వ తేదీన రూ. 50 వేలలోపు రైతులకు రుణాల మాఫీ ప్రకటించనున్నారని, తర్వాతి రోజు (ఆగష్టు 16) నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,006 కోట్లు జమ కానున్నట్లు మంత్రి తెలిపారు.  బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే  మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల రుణ మాఫీ చేస్తునందుకు వ్యవసాయ శాఖ తరుపున సీఎం కేసీఆర్ గారికి, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.  చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా,  బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరేలా చూడాలన్నారు అన్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss