తెలంగాణలోని కరోనా కేసుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా తెలంగాణలో పాసిటీవ్ కేసుల సంఖ్య 1592 గా ఉండగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1002గా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 10 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 41 కేసులు గడచిన 24 గంటల్లో నమోదు కావడం కొంత ఆందోళన కలిగించే అంశం. ఇప్పటివరకు నమోదయిన కరోనా మరణాలు తెలంగాణలో 34 గా ఉంది. ఈరోజుకు తెలంగాణలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 556 గా ఉంది.
గడచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి… జిహెచ్ఎంసి (హైదరాబాద్)- 26, వలస కార్మికులు – 12, మేడ్చల్ – 3 గా నమోదయ్యాయి. ఇవి తప్ప మిగిలిన అన్నీ జిల్లాలలో ఒక్క కేసు నమోద కాలేదు అంతే కాకుండా అయితే మిగిలిన అన్నీ జిల్లాలలో గడచిన 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో లాక్ డౌన్ 4 సడలింపులు