Thursday, December 2, 2021

Latest Posts

వృద్ధాప్య పింఛన్‌ వయో పరిమితి తగ్గించిన కేసిఆర్ ప్రభుత్వం

Telangana to Pay Old-age Pension for People Above 57

ఆసరా వృద్ధాప్య పింఛన్‌ వయసు అర్హత 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణా ప్రభుత్వం  ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణాలో 37 లక్షల మందికి ఆసరా పింఛన్‌ ద్వారా నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. అలాగే సుమారు 5లక్షలమంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 ఆసరా పింఛన్‌ అందజేస్తున్నారు. వారితో పాటుగా కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, వితంతువులు, ఎయిడ్స్‌ రోగులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, చేనేత కార్మికులకు కూడా పింఛన్‌ అందిస్తున్నారు.

కాగా ఆదివారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో వృద్ధాప్య పింఛన్‌ వయసు అర్హత 65 ఏండ్ల ఉన్న దానిని 57 సంవత్సరాలకు తగిస్తూ నిర్ణయం తెసుకోగా వాటికీ సంబందించిన ఉతర్వులను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం జారీచేశారు.  వృద్ధాప్య పింఛన్‌ వయసును తగ్గించడంతో లక్షల మందికి ప్రయోజనం కలుగునున్నది. పింఛన్లకు రాష్ట్ర ఖజానా నుండి ప్రతి ఏటా రూ.12 వేలకోట్ల వరకు కేటాయించవలసి ఉంది. కాగా 2021-22 బడ్జెట్‌లో పింఛన్లకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss