కరోనా కారణంగా దాదాపు నెలలు నుంచి థియేటర్లు, సినిమా షూటింగ్‌లకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. దాంతో సినిమా ఇండస్ట్రీపై కరోనా ఈ దెబ్బ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సినిమా తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. థియేటర్స్ లేకపోవడంతో ఓటీటీకి క్రేజ్ పెరిగింది. షూటింగ్స్ చివరిదశలో ఉన్న సినిమాలను పూర్తి చేసి వాటినీ షూటింగ్ చేసి రిలీజ్ కు రెడీ అయినా సినిమాలనూ ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారు. ముందుగా షూటింగ్‌లకు అనుమతులు వచ్చాయి. ఇటీవల థియేటర్లకు కూడా అనుమతులు ఇచ్చింది కేంద్రం. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో షూటింగ్స్ జోరందుకున్నాయి . లాక్‌డౌన్‌తో కొంచెం ఢల్ అయిన ఇండస్ట్రీకి మళ్లీ ఎనర్జీ వస్తోంది. టాప్ హీరోలు సెట్క్ కి రాగానే సందడి మొదలైంది. షూటింగులకి పర్మిషన్లు ఇచ్చాక కూడా చాలా రోజులు టైమ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ నవంబర్ ఫస్ట్ నుంచి “వకీల్‌సాబ్’లో సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఫుల్ స్పీడ్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు.టాలీవుడ్ మోస్ట్ అవైటడ్ మూవీ “ట్రిపుల్ ఆర్’ కూడా షూటింగ్ మొదలుపెట్టేసింది. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేస్తున్నాడు జక్కన్న. ఇక ప్రభాస్ “రాధేశ్యామ్’ రీసెంట్‌గానే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది.కరెక్ట్ లొకేషన్ కోసం చాన్నాళ్లు వెయిట్ చేసిన “పుష్ప’ టీమ్ కూడా షూటింగ్ స్టార్ట్ చేసింది. ఇక కరోనా ప్రభావం తగ్గే వరకు షూటింగ్‌కి వెళ్లనని చెప్పని బాలక్రిష్ణ కూడా బోయపాటి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టేశాడు. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో బీబీ3 షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది.సీనియర్స్‌లో అందరికంటే ముందే షూటింగ్ మొదలుపెట్టిన హీరో నాగార్జున. “బిగ్‌బాస్4‘ ప్రోమోస్‌తో కెమెరా ముందుకెళ్లిన నాగ్, “వైల్డ్ డాగ్’ మనాలీ షెడ్యూల్‌ని పూర్తి చేస్తున్నాడు. వెంకటేశ్ “నారప్ప’ షూటింగ్ కూడా రీస్టార్ట్ అయ్యింది.
ఇది కూడా చదవండి: