హైదరాబాద్: మహిళలు ఎందులోనూ తక్కువ కాదని మరోసారి నిరూపించింది గుంటూరుకు చెందిన దేవిశ్రీ. అగ్రరాజ్యం అమెరికాలోని నావికాదళంలో నేవీ పైలైట్ గా దేవీశ్రీ బాధ్యతలు చేపట్టారు. ప్రవాసాంధ్ర కుటుంబానికి చెందిన దొంతినేని దేవిశ్రీకి చిన్నప్పటినుంచి నేవీ పైలైట్ అవ్వాలని కోరిక ఉండేదని తల్లిదండ్రులు చెప్పారు. అందుకే తన ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తూ రక్షక దళాల వైపు నడిపినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కాగా తాను నేవీ పైలైట్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని దేవిశ్రీ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అమెరికా దేశ భద్రతకు తన పరిధిలో సేవ చేస్తానని దేవిశ్రీ పేర్కొన్నారు. ఆమెకు పలువురు ప్రవాసులు అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి: