Telugu heroes will do movies after lockdown
ప్రస్తుతం తెలుగు హీరోలకు ఉన్నంత క్రేజ్ మరే ఇండస్ట్రి హీరోలకు లేదు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే మన సినిమాలు భారత దేశమంతటా దుమ్ము దులుపుతున్నాయి. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో అందరూ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. కాకపోతే మన తెలుగు హీరోలు ఈ సమయాన్ని మాత్రం తాము నెక్స్ట్ చేయబోయే సినిమాలను లైన్ లో పెట్టడానికి ఎవరి కసరత్తు వారు చేస్తున్నారు. ఒక్క సారి లాక్ డౌన్ తాళాలు బద్దలు కొట్టగానే, షూటింగ్ లతో క్లాప్ కొట్టేస్తారన్న మాట.
విజయ్ దేవరకొండ పురి జగన్నాథ్ సినిమా తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒకటి శివ నిర్వాణతో ఉండగా మరొకటి దిల్ రాజు కాంపౌండ్ లో ఉండబోతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా గీత గోవిందం డైరెక్టర్ తో చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళి సినిమా పట్టలేక్కిస్తాడు. కాగా ఈ రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్ కూడా వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా లైన్ లో మొదలవ్వనున్నాయి. డార్లింగ్ ప్రభాస్ కూడా జిల్ డైరెక్టర్ తో తీసే సినిమా తర్వాత వైజయంతీ మూవీస్ లో ఒక సినిమా చెయ్యనున్నారు.