Thursday, May 13, 2021

Latest Posts

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. దేవిప్రియ ‘ఉదయం’ సహా పలు పత్రికల్లో పనిచేశారు. ఆయన అసలు పేరు షేక్‌ ఖాజా హుస్సేన్‌. కానీ ‘దేవిప్రియ’ కలంపేరుతో రచనలు చేసేవారు. తండ్రి షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌, తల్లి షేక్‌ ఇమామ్‌ బీ. జర్నలిస్టుగా ఆయన అనేక పత్రికల్లో పనిచేశారు.దేవిప్రియ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చక్కటి కవిత్వాన్ని రాయగల దిట్ట. దళిత బహుజన సాహిత్యాన్ని ఎంతో ప్రేమించాడు. దేవిప్రియ అసలు పేరు ఖ్వాజా హుస్సేన్‌. ఈయన కలం నుంచి జాలువారిన కార్టూన్‌ కవితల ‘రన్నింగ్‌ కామెంట్రీ’ పాఠకలోకం మన్ననలు అందుకుంది. ఆయన ఆంధ్రప్రభలో నిర్వహించిన రన్నింగ్ కామెంట్రీ శీర్షిక బహుళ ప్రజాదరణ పొందింది. అమ్మచెట్టు కవితా సంపుటి ఆయనకు గుర్తింపు తీసుకువచ్చింది.

‘గాలిరంగు’ కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 1980లో ‘అమ్మచెట్టు’ కవిత్వానికి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు, 1991లో ‘నీటిపుట్ట’ కవితా సంకలనానికి సినారె కవితా పురస్కారం, 2001లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారందేశంలో కొత్తగా కరోనా కేసులు, 2013లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం అందుకున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss