TG vekatesh says They do not deserve to be in the country
కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేవారు దేశంలో ఉండడానికి అనర్హులని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఢిల్లీ జమాత్‌కు వెళ్ళివచ్చిన వారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కొంత మందే టెస్ట్ లు చేయించు కున్నారు. ఇంకా రాష్ట్రంలో చాలామంది ఉన్నారని అబిప్రాయం వ్యక్తం చేశారు. వారి ద్వారానే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు.
అంతకు ముందు మత కల్లోలాలు జరిగిన ఢిల్లీలోనే మత సమావేశాలకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కోవడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతుంటే ఇక్కడ ఉన్నవారు కొందరు వాటిన్ని వ్యతిరేకించడం చాలా బాధాకరం అన్నారు. దానిని అభినందించకుండా దీపాలు వెలిగించాలనడం మీద రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారు దేశంలో ఉండటానికి అనర్హులని తెలిపారు.