Wednesday, April 21, 2021

Latest Posts

ఆరోపణ చేసిన డాక్టర్ సస్పెండ్  

The accused doctor sudhakar rao was suspended

కరోనా మహమ్మారి వేళ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఓ వైద్యుడు సస్పెండ్ అయ్యారు.  మాస్కులు, తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించిన  నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఎనస్థీషియన్ డాక్టర్ కె. సుధాకర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.  జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానిక వ్యతిరేకంగా మాట్లాడడం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం, తన మాటల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి పలు నేరాల కింద  డాక్టర్ సుధాకర్‌పై కేసులు నమోదు చేసినట్టు నర్సిపట్నం టౌన్ సీఐ స్వామి నాయుడు తెలిపారు.

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం లేపాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సోమవారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో డాక్టర్‌ సుధాకర్‌ అక్కడకు వచ్చారు.

అయితే ఈ సందర్బంగా డాక్టర్‌ సుధాకర్‌  మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపైనా, వివిధ శాఖల ఉన్నతాధికారులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మంగళవారం పత్రికల్లో రావడం, వార్తా ఛానెళ్లలో ప్రసారం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు మంగళవారం ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. అనంతరం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss