Saturday, January 23, 2021

Latest Posts

రంజాన్ మాసం ప్రారంభం – ఇళ్లల్లోనే ప్రార్ధనలు

The beginning of the month of Ramadan Prayers in homes

ముస్లిం లు పవిత్రంగా భావించే రంజాన్ మాసం  నెలవంక దర్శనమివ్వడంతో ప్రారంభమయింది.  శుక్రవారం రాత్రి  రంజాన్ మాసం ఆరంభమైనట్లు రుహియ్యతే హిలాల్‌ కమిటీ అధ్యక్షులు మౌలానా ఖుబ్బుల్‌ పాషా షుత్తరీ ప్రకటించారు. నేటి (శనివారం) తెల్లవారుజామున 4.29 గంటలకు నిర్వహించే సహర్‌తో మొదటి రోజాతో రంజాన్ ప్రార్థనలకు శ్రీకారం చుట్టారు.  లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో  ఎన్నడూలేని విధంగా సామూహిక ప్రార్థనలు రద్దయ్యాయి. దీంతో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా మసీదులన్నీ బోసిపోయాయి.

ఈ ఏడాది రంజాన్‌ పవిత్ర కార్యం మొత్తం ఇళ్లలోనే కొనసాగించాలని ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ,  తెలుగు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్,జగన్ అలాగే ఆయా రాష్ట్రాల సీఎంలు,కేంద్ర మంత్రులు, ఇమామ్ లు ,ముస్లిం ప్రముఖులు ఇప్పటికే విజ్ఞప్తి చేయడంతో  అయిదు పూటల నమాజ్, రాత్రి తరావీలతో పాటు సాయంత్రం ఇఫ్తార్‌ (ఉపవాస దీక్షల విరమణ) కూడా ఇళ్లలోనే పూర్తిచేయాల్సి ఉంది.  నేతలంతా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్‌ నెలలో ఇళ్లలోనే ప్రార్థనలు చేయడంతో పాటు.. ఎవ్వరినీ ఇళ్లకు ఆహ్వానించవద్దని ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుఖారీ ముస్లింలను కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింలు ఇళ్లలోనే ఉంటూ రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవడం మంచిదని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు. ఇక  రంజాన్‌ మాసంలో ప్రభుత్వ ఆదేశాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణా  హోంమంత్రి మహమూద్‌ అలీ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. కరోనా కట్టడి ప్రాంతాల్లో నివసించే ముస్లింలకు అవసరమైన సరుకుల అందజేత, ఇతర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. అలాగే ఏపీలో కూడా రంజాన్ సందర్బంగా కొన్ని ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss