Thursday, May 13, 2021

Latest Posts

ప్రైవేటు ఆస్పత్రులకు కేంద్రం కీలక ఆదేశం

The central government is a key mandate for private hospitals

కరోనా మహామ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ లో ప్రయివేట్ హాస్పిటల్స్ లో అత్యవసర సేవలు తప్ప అన్నింటినీ నిలుపుదల చేసారు. అయితే ఇప్పుడిపుడే లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు వస్తున్న నేపథ్యంలో హాస్పిటల్స్ కి కూడా మినహాయింపులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మే 3తర్వాత ఎలా ఉంటుందన్న చర్చ జోరుగానే నడుస్తోంది. ఇక కేంద్రం తాజాగా హాస్పిటల్స్ కి కీలక ఆదేశం ఇచ్చింది.
డయాలిసిస్, కీమోథెరపీ, పురుళ్లు వంటి అత్యవసర కేసుల విషయంలో ముందుగా కరోనా టెస్టు చేయాలంటూ పేషెంట్లపై ఒత్తడి చేయవద్దని ప్రైవేటు ఆస్పత్రులను కేంద్రం ఆదేశించింది.

ఆయా ఆస్పత్రలు నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. కరోనా రోగలక్షణాలు ఒక్కటి కూడా లేని రోగులకు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయనే వార్త జాతీయ మీడియాలో వచ్చింది.

ముఖ్యంగా ఐసీఎమ్ఆర్ రూపొందించిన ప్రోటోకాల్ ఇతర కేసులు అనే ప్రస్తావన ఉండడాన్ని ఆసరగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులు.. అత్యవసర చికిత్స కోసం వచ్చిన వారికి కరోనా రోగ నిర్ధారణ చేస్తున్నటు వార్తలు వచ్చాయి. కరోనా వ్యాపిస్తోందనే భయంతోనే అవి కరోనా టెస్టులకై ఒత్తడి చేస్తున్నాయనే వార్త వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం తాజా గా కీలక సూచనలు చేస్తూ,ఆదేశాలు ఇచ్చింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss