The Delhi government has sealed 20 COVID-19 hotspots
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడం కోసం ఢిల్లీ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో 20 హాట్ స్పాట్లను గుర్తించిన కేజ్రీవాల్ సర్కారు. వాటిని పూర్తిగా సీల్ చేస్తున్నట్లు ప్రకటించింది. చిన్న చిన్న విలేజ్లు మరియు అపార్ట్మెంట్ కాంప్లెక్సులు కలిగిన 20 కరోనావైరస్ హాట్స్పాట్లను సీలింగ్ చేస్తున్నట్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలెవరూ బయటకు వెళ్లడానికి గాని, బయట వారు లోపలికి వెళ్లడానికి గాని విలులేదని తెలిపారు.ఈ జిల్లాల్లోని హాట్స్పాట్ల్లో నిత్యావసరాలను నూరు శాతం ఇళ్లకు వెళ్లే అందిస్తామని దుకాణాలు, కూరగాయల మార్కెట్లు కూడా తెరవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హెల్త్ వర్కర్లు, నిత్యావసరాలు సరఫరా చేసేవాళ్లు మినహా ఎవరూ ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టొద్దని ఆదేశించారు. మరికొన్ని హాట్ స్పాట్ ప్రాంతాలను గురువరం ప్రకటించ నునట్లు తెలిపారు. అందరూ మస్కులను తప్పని సరిగా వాడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రివాల్ రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.