ట్రంప్ భారత్ టూర్ రహస్యం
మోడీ ఆహ్వానం మేరకు భారత్ వచ్చానన్న ట్రంప్ అంతరంగం ఏమిటి? గడచిన ఆరు ఏళ్ళలో ఇతర దేశాలు భరత్ ను చుసే దృష్టి కోణం మారుతుంది, 2014 లో భారత ప్రధానిగా మోడి పగ్గాలు చెపట్టారు, 2017 లో వైట్ హౌస్ లో డ్రోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా కాలు మోపారు, ఇరాన్ మరియు అఫ్గాన్ యుద్ధాలు తర్వాత అగ్రరాజ్య వైకరిలో మార్పు వచ్చింది. ఇస్లామిక్ టెర్రరిజం ఎదుర్కోవడం కేవలం అధునాతన ఆయుధాలతో సాధ్యం కాదని అమెరికా గ్రహించింది. ఆయుధాలతో పాటు ఆపన్న హస్తాలు కూడా కావాలని నిర్ణయించుకున్న అమెరికా భారత్ కు దగ్గరవ్వాలని చూస్తుంది, మరో వైపు అమెరికాలోని ఇండియన్ డైస్పోరా ద్రుష్టి మరింత దీర్ఘమైంది. శ్వేతసౌధం భారత్ పై తన అంచనాలను మార్చుకుంది. చెప్పినట్టు విని కూర్చునే అనేక దేశాలలో భారత్ ఒకటి కాదని ఖరారు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది.
చైనాతో వాణిజ్య పోరు, ఉత్తర కొరియాతో కయ్యం, అరబ్బు దేశాలలో వ్యతిరేకత విర్రవీగిన అమెరికాకు ముక్కు తాళ్లు పడ్డాయి. ఇలాంటి టైంలోనే ట్రంప్ భారత్ పర్యటన ఖరారయ్యింది. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోలాహలంలోనే ఓటర్ల త్రాసుకు మరింత విలువ చేకూరుతుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు భారత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అమెరికా భారత్ మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు లేవని కరాఖండిగా చెప్పేసిన వైట్ హౌస్, అయినా భారత్లో ఈ కోలాహలానికి కారణం ఏంటి, దీనికి కారణం అమెరికాలో ఉన్న ఇండియన్ డైస్పోరా ద్వారా వచ్చే ఓట్లు అధ్యక్ష ఎన్నికలకు అవసరం అని అమెరికా భావించడమే.