Monday, May 10, 2021

Latest Posts

ఆర్.ఆర్.ఆర్.లో కీలక  మలుపు అజయ్ దేవగన్ తోనేనట

The key turning point in the RRR was with Ajay Devgn

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటేనే భారీ అంచనాలుంటాయి. అందునా  బాహుబలి తర్వాత  తీస్తున్న భారీ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. మల్టీ స్టారర్ గా తీస్తున్న  ఈ మూవీని వచ్చే జనవరి 8 సంక్రాంతి కానుకగా  విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ  కరోనా కారణంగా షూటింగ్  వాయిదా పడడంతో ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మాత డీవీవీ దానయ్య తీస్తున్న ఈ మూవీలో చరణ్ – ఎన్టీఆర్ – అజయ్ దేవ్ గణ్ – ఆలియా భట్ – ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  అల్లూరి సీతారామరాజు.. ఉత్తరాంధ్ర మన్యం వీరుడు. అక్కడ గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ వారితో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఇక కొమురం భీం.. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో గిరిజనుల కోసం తుపాకీ పట్టి నిజాం ప్రభువులను ఎదురించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన గిరిజన యోధుడు.

నిజానికి చరిత్రలో ఈ ఇద్దరు రెండు ప్రాంతాల విముక్తి కోసం పోరాడారు.. రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేశారు. ఇద్దరు కలిసింది లేదు.. కలిసి పోరాడింది లేదు. కానీ ఒకే కాలంలో ఈ ఇద్దరు వారి వారి ప్రజల కోసం పాటుపడ్డారు. అయితే ఆర్ ఆర్ ఆర్ ద్వారా  రాజమౌళి ఈ ఇద్దరి కథను తీసుకొని సినిమాటిక్ స్టైల్లో స్నేహితులుగా చూపించబోతున్నాడా? అని అనిపిస్తోంది.  వారిద్దరూ తమ సొంత ప్రాంతాన్ని వదిలి రెండు మూడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. అక్కడ ఏం చేశారన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇదే కథను తీసుకొని రాజమౌళి సృజనాత్మకంగా కల్పనగా అల్లి చూపించబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. చరిత్రలో అస్సలు కలవని ఇద్దరు యోధులు అల్లూరి – భీంలు కలిస్తే ఎలా ఉంటుంది? వారిద్దరూ అజ్ఞాతవాసంలో కలిసి పోయి సొంత ప్రాంతాలకు వచ్చి విప్లవవీరులుగా ఎదిగిన వైనాన్ని రాజమౌళి కల్పిత కథగా ‘ఆర్ ఆర్ ఆర్’లో చూపించాలని భావించడమే ఓ రివల్యూషనరీ థాట్.

ఇక తాజాగా ఆర్ ఆర్ ఆర్ కథకు సంబంధించి కీలక మలుపు ఇదేనంటూ టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీని వివరాల్లోకి వెళ్తే,..  యుక్త వయసులోకి వచ్చిన అల్లూరి – కొమురం భీంలు వారి ప్రాంతాల్లో దొరల అన్యాయాలను సహించలేక, ఏమీ చేయలేక ఇంటి నుంచి పారిపోయి ఉత్తర భారతానికి వెళ్లిపోతారు. అజ్ఞాతంలో బతుకుతారు. ఆ సమయంలోనే వీరిద్దరూ బాలీవుడ్ అగ్రహీరో ‘అజయ్ దేవగణ్’ను కలుస్తారట. వీరిలో గల కసిని శక్తిగా మార్చే గురువుగా అజయ్ దేవ్ గణ్ ‘ఆర్ ఆర్ ఆర్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడట.అసమాన యుద్ధ విద్యలు నేర్పి,పోరాటానికి పంపించే గురువుగా అజయ్ దేవ్ గణ్ కనిపిస్తారట..అందుకే ఆర్ ఆర్ ఆర్ కథను మలుపుతిప్పేలా అజయ్  పాత్ర ఉంటుందట. ఈ కీలక ట్విస్ట్ సినిమాలో అలరిస్తుందని టాక్.  భీం – అల్లూరి లాంటి యోధులకే గురువు లాంటి పాత్ర కు పెద్ద హీరో కావాలని  అజయ్ దేవ్ గణ్ ను తీసుకున్నారట.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss