ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల “ఆత్మనిర్భర్ భారత్” ప్యాకేజీకి చివరి ప్రకటనగా మరికున్ని కీలకాంశాలు ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. గత నాలుగు రోజులుగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను రోజుకో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలుపుతున్న సంగతి తెలిసిందే. చివరి ప్రకటనగా ఈ రోజు ఆర్ధికశాఖ మంత్రి మరికొన్ని అంశాలు తెలిపారు.
దేశంలో సంక్షోభం తలెత్తింది అయితే అ సంక్షోభంలోనూ అవకాశాలువెతుక్కోవాలని సూచించారు. మూడు నెలల వరకు పేదలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు అదజేస్తామన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు నిత్యావసరాలు అందిస్తామని దేశంలో ఏ ఒక్కరూ ఆకలి భాదతో నిద్రించకూడదని ఆదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్వో ఖాతాదారులు రూ.3,600 కోట్ల నగదు వెనక్కి తీసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. జన్ధన్కు సంబంధించి రూ.20 కోట్ల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశామని ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని మోదీ మొదటి నుంచీ చెబుతున్నారని తెలిపారు.అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమచేశామని అన్నారు.
ఇది కూడా చదవండి: ఏ.పీ లో మరో గ్యాస్ లీక్