గత వారం తెలుగు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ లేడీ ఫైర్ కంటెస్టెంట్ పునర్నవి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.అలాగే ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో రాహుల్,వరుణ్ సందేశ్ మరియు మహేష్ విట్టాలు ఉన్నారు.అయితే వీరిలో పునర్నవి మాత్రం కేవలం రాహుల్ మరియు వరుణ్ లకు తమ పీవీవీఆర్ ఫ్యాన్స్ ఓట్స్ వేసి సేవ్ చెయ్యండి అని చెప్పి ఒక వీడియో ద్వారా బిగ్ బాస్ వీక్షకలకు చెప్పిన సంగతి కూడా చూసాము కానీ ఇదే వీడియోలో పునర్నవి అన్న ఒక మాట బిగ్ బాస్ షో ఫాలోవర్స్ కు తెగ నవ్వు తెప్పిస్తోందట.
ఆమె ఈ వీడియోలో మాట్లాడుతూ కేవలం రెండు మూడు ఓట్ల తేడాతోనే ఎలిమినేట్ అయ్యాను అని చెప్తుంది.దీనితో ఈ వీడియో చూసి నవ్వుతున్నారు.ఆమ్మో రెండు మూడు ఓట్ల తేడాతో ఎలిమినేట్ అయ్యావా అసలు అనుకోవద్దమ్మా అంటూ సెటైర్లు వేస్తున్నారు.అయినా రెండు మూడు ఓట్ల తేడాతో ఎలిమినేట్ అయ్యానని చెప్పుకోవడం కామెడీగా ఉందని మరికొందరు అంటున్నారు.బయటకొచ్చిన తర్వాత మహేష్ తో సమానంగా ఓట్లు వచ్చాయని అనుకుంటుందేమో అంటూ నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.