Friday, March 5, 2021

Latest Posts

రంజాన్ కి మక్కాలో సంచలన నిర్ణయం

The sensational decision in Ramadan to Mecca

కరోనా మహమ్మారి,లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో   రంజాన్ మాసం సందర్బంగా ప్రార్ధనలు ఇళ్లల్లోనే చేసుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడమే కాకుండా ముస్లిం పెద్దలు కూడా ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కొంచెం కష్టమైనా చెప్పక తప్పడం లేదని, ఎపి సీఎం జగన్ కూడా ముస్లిం పెద్దలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పుకొచ్చారు. ఇక సౌదీఅరేబియాలో కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రంజాన్ మాసంలోనూ ముందుజాగ్రత్త చర్యగా మక్కా నగరంలోని అల్ హరం అల్ నబవీ మసీదులను మూసివేస్తూ ఆ దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

రంజాన్ ఉపవాసాల సందర్భంగా ప్రపంచంవ్యాప్తంగా లక్షలాది మంది హజ్ యాత్రకు వచ్చిన భక్తులు ఈ మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ఈ ఏడాది రెండు మసీదుల్లోనూ ప్రార్థనలు నిలిపివేయాలని నిర్ణయించామని ఈ మసీదుల ప్రెసిడెంట్ జనరల్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ ప్రకటించారు. ఈమేరకు ఆయన  తాజాగా ట్వీట్ చేశారు. రమజాన్ సందర్భంగా ముస్లిములు ఉపవాసాలు ఉండటంతోపాటు తరావీ నమాజులు చేస్తుంటారు. తరావీ నమాజులతో పాటు రంజాన్ఈద్ నమాజ్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ షేఖ్ కోరారు.

కరోనా వైరస్ ప్రబలుతున్నందున గత నెలలోనే సౌదీ అరేబియాలోని మక్కా పవిత్ర మసీదుల్లో ప్రార్థనలను ఆ దేశ సర్కారు నిలిపివేసింది. సౌదీఅరేబియాలో పదివేలమందికి కరోనా వైరస్ సోకగా, ఇందులో 103 మంది మరణించారు. దీంతో రంజాన్ మాసంలోనూ మసీదులను మూసివేసి, ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss