Thursday, May 13, 2021

Latest Posts

చనిపోతూ అలెగ్జాండర్ కోరిన ఆ మూడు కోరికలు..??

The three last wishes of Alexander the great

క్రీస్తు పూర్వమే ప్రముఖ స్థానాన్ని సంపాదించిన వ్యక్తి గా అలెగ్జాండర్ ది గ్రేట్ మనందరికీ తెలుసు. తన16వ ఏటనే తండ్రి వారసునిగా రాజ్యాధికారం పొంది చిన్న వయస్సు లోనే తెలిసిన ప్రపంచంలోని చాలా భాగాన్ని ఆక్రమించి చరిత్రకారులు చే ది గ్రేట్ అనిపించుకున్నాడు అలెగ్జాండర్. ఇకపోతే ప్రపంచ విజేతగా నిలిచిన అలెగ్జాండర్ తన చివరి క్షణాల్లో మూడు కోరికలనూ నెరవేర్చమని తన సైన్యాన్ని కోరాడు. మరి అలెగ్జాండర్ కోరిన ఆ కోరికలు ఏమిటి వీటి వెనుక అసలు కారణం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా నిలిచి తిరిగి తన రాజ్యానికి వస్తుండగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణానికి చేరువవుతాడు. తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద అవేమీ కూడా మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది. ఆ సమయం లో తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.  నేను ఇంకా కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరిగా మూడు కోరికలున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు అలెగ్జాండర్. ఆప్పుడు అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు. మొదటి కోరిక ఏమిటంటే నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మూయాలి. ఇక రెండవ కోరిక నా పార్థివ దేహం స్మశాననికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు మణిమాణిక్యాలు పరచండి.

మూడవ కోరిక ఏమిటంటే శవపేటికలో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి అని కొరటం జరిగింది. చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోగా.. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చి ఈ కోరికల వెనుక ఆంతర్యమేమిటో  చెప్పమని అడిగాడు. దీనికి జవాబు గా… ఈ కోరికలు నేను ఇప్పుడే నేర్చుకున్నా పాఠాలకు ప్రతిరూపాలు. మొదటి కోరిక లో ఆంతర్యమేమిటంటే నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు ఒకవేళ వైద్యం చేసిన వల్లకాటి వరకే అని చెప్పటానికి. ఇక రెండో కోరికలో ఆంతర్యం నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అదేదీ నా వెంట తీసుకు వెళ్ళ లేక పోతున్నానని కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మామాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి. ఇక మూడో కోరికలో ఆంతర్యం ఏమిటంటే ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ఈ కోరికలు అని చెప్పి మరణించాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss