The Union Home Ministry has anger the state of Bengal
భారత్ సరిహద్దులలో నిత్యావసర సరుకుల రవాణాకు మమత సర్కారు అనుమతివ్వక పోవడంపై కేంద్ర హోం శాఖ ఫైర్ అయ్యింది. కేంద్రం పదే పదే చెబుతున్నా నిత్యావసర సరుకుల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని, కేంద్రం చెబుతున్నా మార్గదర్శకాలను రాష్ట్రం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది విపత్తు నిర్వహణ చట్టానికి తూట్లు పొడవడమే అవుతుందని హోంశాఖ తీవ్రంగా మండిపడింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హాకు ఓ లేఖ రాశారు.
ఇండో – నేపాల్, ఇండో- బంగ్లా, ఇండో – భూటాన్ ఇలా సరిహద్దు రవాణా గుండా వస్తున్న నిత్యావసర సరుకులను అనుమతించాలంటూ కేంద్ర హోంశాఖ నెల రోజుల క్రితం తిలిపింది.ఇతర దేశాల నుండి మనకు వస్తున్న, మనదేశం నుండి ఇతర దేశాలకు వెళ్తున్నా నిత్యావసర సరుకులను బెంగాల్ వద్ద ఆపేసినట్లు తమకు సమాచారం వచ్చిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఉన్న ఒప్పందాల ప్రకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అటు కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ నిత్యావసర సరుకుల రవాణాను ఆపడానికి వీల్లేదంటూ మార్గదర్శకాల్లో హోంశాఖ స్పష్టంగా పేర్కొందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బెంగాల్ సర్కారు మరోసారి ఆ మార్గదర్శకాలను గుర్తుచేశారు.