Sunday, February 28, 2021

Latest Posts

మా వంతు సాయం అంటున్న జైలు ఖైదీలు

The UP prisoners donate the fight of coronavirus

కరోనా బారినపడిన వారు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు మిలయన్ల వరకు ఉంటారు. లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశంలో కూడా పన్నెండు వేల మందికి పైగా కరోనా సోకగా, సుమారు నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ విధించిన దేశంలో వైరస్‌ నియంత్రణ రోజు రోజుకు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ వల్ల దేశం ఆర్ధికంగా దెబ్బతినకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నవాడు, లేనివాడు అంటూ తేడా లేకుండా ఎవరికి తోచింది వారు సాయం చేయ్దనికి ముందుకు వస్తున్నారు.

అలాగే మేము కూడా దేశానికి సాయ పడతాము అని యూపీకి చెందిన ఖైదీలు ముందుకొచ్చారు. వారు సీఎం సహాయనిధికి రూ. 2.3 లక్షల విరాళం అందించారు.  దాదాపు 500 మందికి పైగా ఖైదీలు వెస్ట్ యూపీ ప్రాంతంలో ఉన్న ఐదు జైళ్లకు చెందినవారు జైల్లో ఉండి కష్టపడి  సంపాదించిన సొమ్మును యూపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేశారు. ఇందులో ఘాజియాబాద్ జైలు ఖైదీలు రూ. 84,600 విరాళం ఇవ్వగా  మీరట్‌కు చెందిన ఖైదీలు రూ.81,700 ఇచ్చారు. అలాగే ముజఫర్‌నగర్‌కు చెందిన జైలు ఖైదీలు కూడా రూ. 28 వేలు విరాళం అందించారు. ఇంకా కొన్ని జైళ్లలో ఖైదీలు మాస్కులు తయారు చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss