తెలంగాణలో సినిమా థియేటర్స్ లలో పనిచేసే కార్మికులకు లాక్ డౌన్ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ సినిమా ధియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ( సి ఐ టి యు ) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సినిమా థియేటర్స్ పనిచేసే కార్మికులందరికీ లాక్ డౌన్ కాలానికి పూర్తి జీతం ఇవ్వాలని జీవో నెంబర్ 45 తీసుకు రావడం జరిగింది కానీ సినిమా థియేటర్ యజమానులు ధియేటర్ లో పనిచేసే కార్మికులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు.
సినిమా థియేటర్ యజమానులు ప్రభుత్వం ఇచ్చిన జీవోను లెక్కచేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పనిలో నుంచి తొలగిస్తున్నారని, ఉన్న కార్మికులకు కూడా వేతనంలో 40 – 50 శాతం వేతనాల్లో కోతలు విధిస్తున్నారని, యజమానులపై కఠిన చర్యలు తీసుకొని కార్మికులకు సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ సందర్బంగా విన్నవించుకున్నారు. అలాగే సినిమా థియేటర్స్ పనిచేసే కార్మికులకు నిత్యవసర సరుకులు, ఏడు వేల 5 వందల రూపాయలు ఆర్ధిక సహాయం అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి: ఏ.పీ లో రెండో విడత వాహనమిత్ర పథకం