Tuesday, January 25, 2022

Latest Posts

అనుమతి ఇచ్చినా ఓపెనింగ్ కు నోచుకోని థియేటర్లు

Theaters do not look permitted opening

కరోనా సెకండ్ వేవ్ తో మరో సారి మూతబడ్డ థియేటర్లు రేపటి నుంచి తెరుచుకునేందుకు ఏపీ ప్రభుత్వం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమాలు ప్రదిర్శించుకోవచ్చునని ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఇప్పుడు టికెట్‌ రేట్లు వివాదానికి దారితీసింది. సిటీ పరిధిలోని థియేటర్లలో టికెట్లకు ఒక రేటు, నగర శివార్లు, బీ, సీ థియేటర్లలో టికెట్లకు మరో రేటును నిర్ణయించుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ రేట్ల ప్రకారమే టికెట్లను విక్రయించాలని ఆదేశించింది.

అయితే, ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం థియేటర్లను నడపలేమని అంటున్నారు థియేటర్ల ఓనర్స్‌. టికెట్‌ ధరలు, లైసెన్సింగ్‌ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టికెట్‌ ధరలపై క్లారిటీ వచ్చాకే థియేటర్లు ఓపెన్‌ చేయాలనే ఆలోచనలో థియేటర్ల ఓనర్స్‌ ఉన్నారు.  కానీ రేపటి నుంచి కొత్త సినిమాలు విడుదల కావడంతో సందిగ్దంలో పడ్డారు. ఈ అంశంపై విజయవాడలో ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్‌  అసోషియేషన్‌ సభ్యులు సమావేశమై త్వరితగతిన అన్ని జిల్లాల థియేటర్ల యజమానులు దీనిపైనే చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss