Monday, May 10, 2021

Latest Posts

ఫ్రాన్స్ లో జరిగిన అల్లరులకు కారణాలు ఇవే ..

These are the causes of the riots in France

కరోనా విజ్రంబిస్తున్న తరుణంలో దానిని కట్టడి  చేయడానికి  చాలా దేశాలు లాక్ డౌన్ నే మార్గం గా తీసుకున్నాయి. అలాగే ఫ్రాన్స్‌ కూడా దానిని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. కానీ అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధించిన లాక్‌డౌన్‌ను మే 11వ తేదీ వరకు పొడిగిస్తూ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే  ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్ నగరం శివారులో సోమవారం ఉదయం లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా కొందరు అల్లరిముకలు అల్లర్లుకు దిగారు.

వివరాలలోకి వెళ్తే సోమవారం తెల్లవారు జామున ఓ పోలీసు వ్యాన్‌ ఢీకొని 30 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడడంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. అల్లరిముకలు  గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి టపాకాయలు కాలుస్తూ పోలీసులపైకి, గాలిలోకి వాటిని విసిరారు. ప్యారిస్ పోలీసులు భాష్ప వాయువును ప్రయోగిస్తూ లాఠీ చార్జీ చేస్తూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నందుకు యువత తిరగబడిందని అధికారుల సమాచారం.   లాక్‌డౌన్‌ను మే 11వ తేదీ వరకు పొడిగిస్తూ ఆ దేశాధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేయడంతోనే ప్యారిస్ యువతలో అసహనం పెరగడంతో ఈ విధంగా అల్లర్లకు పాల్పడుతునట్లు అధికారులు తెలిపారు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss