Tuesday, March 9, 2021

Latest Posts

తెలుగు నేల పై కోడిపందాల చరిత్ర ఇదే

తెలుగు నేల పై కోడిపందాల చరిత్ర ఇదే | Kodi Pandalu History | 99Telugu Facts

కోడి పందాలు

తెలుగు నేల మీద కోడి పందాలకి ఒక చరిత్ర వుంది. తెలుసుకుందా మా? వివరాల్లోకి వెళితే ఆశ్చర్యం కలుగుతుంది. నిజమేనండి! చరిత్ర అంటే మామూలు చరిత్ర కాదు. రాజ్యాలను కూల దోసిన చరిత్ర. అటువంటి చరిత్ర స్తృస్టించిన కోడి పుంజుల విషయం లో ఒక శాస్త్రమే పుట్టుకొచ్చింది. దానినే కుక్కుట శాస్త్రం అని అంటారు. పూర్వం దీనినే కుక్కుట పురాణం అనేవారు.

ఈ శాస్త్రం లో కోడి పుంజులకు సంబంధించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. అంటే కోడి శరీరం మీద వున్న ఈకలను బట్టి వివిధ రకాలుగా విభజించారు. వాటిని ఏ విధం గా పెంచాలి, ఏ విధమైన ఆహారం పెట్టాలి, ఏ విధంగా సంరక్షించాలి వంటి అనేక విషయాలు ఈ కుక్కుట శాస్త్రం లేదా కుక్కుట పురాణం లో చెప్పటం జరిగింది. ఈ కోడి పుంజలు చరిత్ర సుదీర్ఘమైంది, పురాతనమైంది. వీటి ప్రస్తావన “కేయూరా బాహు చరిత్ర” లో కనిపిస్తుందని కవులు చెప్తారు. ముఖ్యంగా 15 వ శతాబ్ది లో పల్నాడు ప్రాంతం లో కోడి పుంజుల ప్రాచుర్యం బాగా కనిపిస్తుంది. పల్నాటి యుద్దానికి కారణమైంది ఈ కోడి పుంజులే. వీటిని పోరుకు ప్రతీకలుగా చరిత్ర చెబుతోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss