Friday, June 25, 2021

Latest Posts

సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి రోల్ ఇదే

అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ఇండస్ట్రీని వదిలేసి, రాజకీయాల్లో చేరింది. అయితే దాదాపు 13 ఏళ్ళ విరామం తర్వాత, రీ ఎంట్రీ ఇస్తోంది. ఈమె అప్పుడెప్పుడో నాయుడమ్మ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అనిల్ రావిపూడి తన కథతో లేడీ సూపర్ స్టార్ ను మెప్పించి స్క్రీన్‌పై మళ్లీ విజయశాంతిని నటించేలా ఒప్పించాడు. ఇన్నేళ్ళ తర్వాత ఆమె నటించడానికి ఒప్పుకుందంటే అందులో ఏదో ఉంటుందని చెప్పవచ్చు. పైగా ఆమె కారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా ఊహించవచ్చు.

ఇదే విషయాన్ని విజయశాంతి దగ్గర ప్రస్తావించగా, సినిమాలో తన పాత్ర చాలా హూందాగా ఉంటుందని, ఇన్నేళ్ళ తర్వాత తన రీ ఎంట్రీ కోసం ఎలాంటి పాత్ర అయితే కోరుకున్నానో అలాంటి పాత్రే వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి మరో సీక్రేట్ కూడా చెప్పాడు. ఈ చిత్రంలో విజయశాంతి పాత్రకు మాత్రమే గల స్పెషాల్టీ , మిగిలిన వాళ్లకు లేని తేడా బహిర్గతం చేసాడు.
సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబుతో సహా అన్ని పాత్రలు కూడా కామెడీ చేస్తాయని, అయితే ఒక్క విజయశాంతి మాత్రమే కామెడీకి దూరంగా ఉంటుందని అనిల్ క్లారిటీ ఇచ్చాడు. చివరకు ప్రకాశ్ రాజ్, అజయ్ లాంటి వాళ్లు కూడా నవ్విస్తారట.

ఆమె పాత్ర మాత్రం పూర్తిగా సీరియస్ గా కొనసాగుతుందని చెప్పాడు. విజయశాంతితో ఉన్నపుడే మహేష్ పాత్ర కూడా సీరియస్‌గా ఉంటుందని చెప్పాడు. ఆమె పాత్ర అలా ఉండటానికి కారణం ఏంటంటే, సినిమా కథను లీడ్ చేసేది విజయశాంతి అంటున్నాడు. అందుకే ఆమె తప్ప అందరితోనూ కామెడీ చేయించినట్లు చెప్పాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss