Monday, May 10, 2021

Latest Posts

బండ్ల గణేష్ బ్యానర్లో కనిపించనున్న ముగ్గురు మెగా హీరోలు

డైరెక్టర్ బండ్ల  గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా కన్ ఫర్మ్ అయ్యిందని ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ తో బండ్ల గణేష్ మూవీ ఖరారు అయ్యింది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం పవర్ స్టార్ వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వా త క్రిష్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు. వీటితో పాటు బండ్ల గణేష్ బ్యానర్ లో కూడా సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరు మెగా హీరోలతో కూడా సినిమా కన్ ఫర్మ్ చేసుకున్నాడని. అడ్వాన్స్ కూడా ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ ఇద్దరు మెగా హీరోలు ఎవరంటారా ఒకరు మెగాస్టార్ చిరంజీవి. మరోకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం చిరు, చరణ్ కోసం సరైన కథ, అలాగే డైరెక్టర్ ని సెర్చ్ చేస్తున్నాడట. ఒకరిద్దరు డైరెక్టర్స్ తో బండ్ల గణేష్ మంతనాలు జరిపారని త్వరలో డైరెక్టర్ ఎవరు అనేది ఖరారు చేయనున్నారని తెలిసింది.అయితే  ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ మారింది.

ఇది కూడా చదవండి: 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss