కే.జీ.ఎఫ్ లో విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని కొల్లర్ జిల్లా మారి కుప్పం వద్ద మూసేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కే.జీ.ఎఫ్) గనుల్లో బంగారం దొంగతనం చేసేందుకు వెళ్ళిన ఐదుగురరిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వంద అడుగుల లోతుకు వెళ్ళిన ముగురికి ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ కరణంగా మార్చి1 నుండి కే.జీ.ఎఫ్ లో ఉన్న భారత్ గోల్డ్ మైన్స్ మూసేశారు. అప్పటినుండి మైన్స్ లో బంగారాన్ని దొంగతనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా స్కంద, స్కంద కుమారుడు పాదయప్ప, జోసఫ్, సంతోష్ మరియు ఇంకో గుర్తు తెలియని వ్యక్తి కలిసి బీ.జీ.ఎం.ఎల్ గనుల్లో బంగారాన్ని దొంగతనం చేసేందుకు ప్రయత్నిచగా స్కంద, జోసఫ్, మరో వ్యక్తి తాడు శయంతో గనుల లోపలికి వెళ్లారు. పాదయప్ప, సంతోష్ లు గని బయట ఉన్నారు. కొంత సేపటికి స్కంద కుమారుడుకి ఫోన్ చేసి మమల్ని కాపాడమని, లోపల ఊపిరి ఆడటం లేదని కోరాడు. దాంతో దిక్కు తోచని పరిస్థితిలో అక్కడి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గనుల లోపలికి వెళ్ళి బాధితులను కాపాడే ప్రయత్నం చేయగా వారు అప్పటికే ఊపిరి ఆడకపోవడంతో ముగ్గురు మృతి చెంది ఉన్నారని వారిలో స్కంద, జోసఫ్ ల మృతదేహాలు మాత్రమే దొరికాయని మరో వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉందని ఎస్పీ సల్మాన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: భర్తని ఉతికేసిన సాగరకన్య..!