three years imprisonment for obstructing funerals in Tamil Nadu
తమిళనాడులో ఇటీవల కరోనా సోకి మరణించిన వారి అంత్యక్రియలకు స్థానికులు అడ్డు తగులుతున్న ఘటనలు కొన్ని వెలుగు లోనికి వచ్చాయి. వారి అంత్యక్రియలకు చేయ్దనికి అధికారులు చాలా శ్రమించారు. అలాగే ఇలాంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వానికి కూడా పలు ఫిర్యాదులు అందాయి. దాంతో కరోనా బారినపడి చనిపోయినవారి అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ్ళు జైలు శిక్ష తప్పదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. కోవిడ్‌తో మృతి చెందినవారి అంతిమ సంస్కారాలు గౌరవంగా జరగాలని వెల్లడించింది. కోవిడ్ మృతుల అంతిమ సంస్కారాలకు జరగకుండా అడ్డుపడే వారు నేరస్తులుగా మిగులొద్దని హితవు పలికింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. గుంటూరులో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి దహన ప్రక్రియ వివాదాస్పదమైంది. అందువల్ల తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారం కరోనా సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలను, దహన ప్రక్రియను అడ్డుకుంటే నేరంగా పరిగణిస్తారు. జరిమానాతో పాటు ఒకటి నుంచి మూడేళ్ల జైలు శిక్ష పడే ఆవకాశముంది. గతవారం చెన్నైలో వెలుగు చూసిన ఓ హృదయవిదారక ఘటన సంచలనం కావడం తో చెన్నై హైకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.