Monday, May 10, 2021

Latest Posts

అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన టిక్ టాక్ స్టార్

Tik Tok Bhargav Arrested

టిక్‌టాక్‌ ఫేం‌ భార్గవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో మైనర్‌ బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పోలీస్ స్టేషన్ లో భార్గవ్‌పై కేసు నమోదైంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్‌ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. ఈ పరిచయంతో ఆ మైనర్‌ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్‌ చేయడం, కలుసుకుంటుం‍డంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్‌ వీడియోల పేరుతో భార్గవ్‌ ఆమెను లోబర్చుకున్నాడు.

ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సం‍ప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఈ నెల 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. ​ విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. బాలికను చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు భార్గవ్‌ సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss