Thursday, December 2, 2021

Latest Posts

సినిమా హాల్లో టిక్‌టాక్ స్టార్ ని కాల్చి చంపారు

Tik Tok Star Shot At Movie Theater In California

టిక్‌టాక్ స్టార్ ఆంథోనీ బరాజాస్ ను సినిమా థియేటర్‌లో కాల్చి చంపారు. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. పోలీసులు అధికారులు ఈ సంఘటనను ఊహించని దాడిగా అభివర్ణించారు. ఈ కాల్పుల్లో 19 ఏళ్ల ఆంథోనీ బరాజాతో పాటు, అతని 18 ఏళ్ల స్నేహితురాలు రైలీ గుడ్రిచ్ కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు.

“ది ఫరెవర్ పర్జ్” అనే సినిమా చూస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. తలలో రెండు బుల్లెట్స్ దొరికాయని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయిందని సమాచారం. ఆంటోనీ బరాజాస్‌కు టిక్‌టాక్‌లో దాదాపు 930,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో 20 ఏళ్ల జోసెఫ్ జిమెనెజ్‌ అనే వ్యక్తి కాల్పులు చేశాడని తేలింది. అయితే ఎందుకు వారి పై దాడి చేశాడనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss