ప్రస్తుతం టిక్ టాక్ అంటే తెలియనివారుండరు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ తాము చేసిన ప్రతి ఒక వీడియోను టిక్ టాక్ లో పెట్టి ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు. అలా టిక్ టాక్ చేస్తూ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు.. అలాగే కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలా టిక్ టాక్ మోజులో పడి ఒక యువకుడు జైలు పాలయ్యాడు. అసలు ఎందుకు ఆ యువకుడు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అనుకుంటున్నారా. ఏం లేదండి ప్రస్తుతం అందరికీ వాళ్లు లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు చిన్న విషయమైనా టిక్ టాక్ లో పెట్టి ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. అలా ఆ యువకుడు చేసిన పని అతనిని కటకటాల వెనక్కు నెట్టింది.
అనంతపురం జిల్లా అయ్యాంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నాగార్జున అనే వ్యక్తి ఆత్మకూరు అటవీ శాఖ పరిధిలో ఒక జింక పిల్లని పట్టుకొని దానికి పాలు తాగిస్తూ టిక్ టాక్ వీడియో చేశాడు. అంతేకాదు కుందేలు మాంసాన్ని కుక్కకు తినిపిస్తూ మరొక వీడియోని కూడా చేశాడు. ఆ వీడియోను టిక్ టాక్ లో పెట్టాడు. ఈ విషయం అధికారుల దృష్టికి చేరడంతో విచారణకు ఆదేశించారు. నిందితుడు నాగార్జునను పట్టుకున్న అటవీ అధికారులు రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: