ఏపి ప్రభుత్వం లోక్ డౌన్ నియమాలను కొంచెం కొంచెం గా సడలిస్తూ ప్రజా జీవనానికి అనుమతులు ఇస్తున్న సమయంలో దేవుని దర్శనానికి కూడా అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. కాగా హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని తెరవబోతున్నారు. కాగా దీనికి తగిన కసరత్తు మొదలు పెట్టింది టిటిడి. ప్రస్తుతం నెలకొన్న పరిస్తితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. కాగా ముందుగా ప్రయోగాత్మకంగా కొంతమంది భక్తులకు అవకాశం ఇచ్చి దర్శనాన్నికి వీలు కల్పిస్తుంది. రోజులో 14 గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
అయితే ఒక్కొక్క గంటకు 14 మందిని మాత్రమే అనుమతించాలని భావిస్తుంది టిటిడి యాజమాన్యం. మొదటి 3 రోజులు టీటీడీ ఉద్యోగులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ ఆ తరువాత మాత్రం 15 రోజులు స్థానిక వాసులను అనుమతించాలని భావిస్తుంది. ఈ ప్రక్రియలో రోజుకు 7 వేల మందికి దర్శణ భాగ్యం దక్కనుంది. కాగా దర్శనానికి ముందు ఆన్ లైన్ లో టికెట్ విక్రయించాలని, అవి ఉన్న భక్తులు మాత్రమే కొండ మీద శ్రీ వారి దర్శనం పొందగలరాని తేల్చి చెప్పింది టిటిడి.
ఇది కూడా చదవండి: తర్జన భర్జనలో ఖైరతాబాద్ మహాగణపతికి ఉత్సవ కమిటి