Monday, October 25, 2021

Latest Posts

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలలో వైసీపీ భారీ ఆధిక్యం

Tirupati By Election Results 2021

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి కె.రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతామోహన్‌ పోటీ చేశారు. అలానే ఇండిపెండెంట్లుగా మరో 23 మంది అభ్యర్ధులు పాల్గొన్నారు.

ఇక ఓట్ల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి 36వేల ఓట్లకు పైగా భారీ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 1102,068 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా అందులో ప్రస్తుతానికి వైసీపీ 66958,  టీడీపీ 34561, బీజేపీ  5117, కాంగ్రెస్ 829 ఓట్లను సాధించింది. మొత్తం అన్ని పార్టీల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు పై ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది.

నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో, తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  ఇకపోతే ఓట్లను మొత్తం 25 రౌండ్లలో లెక్కిస్తారు. డీకే ప్రభుత్వ మహిళా కళాశాల ఓట్ల లెక్కింపు కేంద్రంలో 7 హాళ్లు, వెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో 10 హాళ్లు ఏర్పాటు చేశారు.

ఎవరు గెలుస్తారనేది మధ్యాహ్నం కల్లా తేలిపోతుందని సమాచారం. అలానే విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. తిరుపతి, నెల్లూరుల్లో శనివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss