Titanic Sank Date
టైటానిక్ నౌక, “వైట్ స్టార్ లైన్” అనే సంస్థ కోసం “హర్లాండ్ అండ్ వోల్ఫ్” అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఇది ఒకటి. 1912లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రయాణ నౌక ఇదే. టైటానిక్ నౌక మొట్టమొదటి, చిట్టచివరి ప్రయాణం ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకూ సాగవలసినది. ఎడ్వర్డ్ జె స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, 1912, ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమై.. ఏప్రిల్ 14, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనలో 1517 మంది ప్రజలు మృత్యువాత పడటంతో చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.
దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా, అది అలా మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే 1985లో వోడ్స్ హోల్ సముద్ర పరిశోధనా సంస్థకు చెందిన జీన్ లూయిస్ మైకేల్, రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో సముద్రం అడుగు భాగంలో 2 మైళ్ళ లోతులో ఈ నౌక అవశేషాలను కనుగొనడం జరిగింది. ఈ పరిశోధనలో నౌక రెండుగా విడిపోయిందని.. ముందు భాగం, వెనుక భాగం విడిపడిపోయి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో 600 మీటర్ల దూరంలో పడి ఉన్నట్లు గుర్తించటం జరిగింది.
ఇది కూడా చదవండి: వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బిఐ
ప్రయాణికులు | ప్రయాణిచింది | బయటపడ్డవారు |
మొదటి తరగతి ప్రయాణికులు | 324 | 201 |
రెండవ తరగతి ప్రయాణికులు | 277 | 118 |
మూడవ తరగతి ప్రయాణికులు | 708 | 181 |
సిబ్బంది | 885 | 212 |
పోస్టుమ్యాన్లు, సంగీత కళాకారులు | 13 | 0 |
టైటానిక్‌లో భారతదేశం నుండి ప్రయాణించిన ఒకే ఒక అమెరికన్ కుటుంబము గుంటూరు కు చెందినవారు. వీరు గుంటూరు నుండి అమెరికాకు తిరిగి వెళుతూ ఇంగ్లాడులో టైటానిక్ నౌక ఎక్కారు. అయితే ఈ దుర్ఘటనలో వీరు రక్షింపబడం జరిగింది.