Sunday, June 20, 2021

Latest Posts

క‌న్నీరు పెట్టిస్తోన్న టీఎన్ఆర్ చివ‌రి మాట‌లు

TNR Last Words Makes People Emotional

ప్రముఖ జర్నలిస్టు, నటుడు టీఎన్‌ఆర్‌ సోమవారం కరోనా కారణంగా కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షోతో టీఎన్‌ఆర్‌ పాపులర్ అయ్యాడు. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తేజ వంటి ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సడెన్ గా అతని మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది.

ప్రస్తుతం అతను చివరిగా మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మనం ధైర్యంగా ఉంటే కరోనా మనల్ని ఏం చేయదంటూ అందరికి ధైర్యం చెప్పిన తీరు భావోద్వేగానికి గురిచేస్తోంది. కరోనా గురించి ప్రజలకు ధైర్యం చెపుతూ టీఎన్‌ఆర్‌ ఏమన్నారంటే, ‘మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్టే హోం చాలెంజ్‌ను నేను స్వీకరించి వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నాను. ఎక్కడికి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటూ మంచి పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తున్నాను. చెడులో కూడా మంచి వెతుక్కోవాలని అంటారు కదా పెద్దలు. ఈ కష్టకాలం నాకు మంచి అలవాట్లను నేర్పింది. అవేంటంటే ప్రాణాయామం, యోగా. రోజూ చేస్తున్నాను. నా పిల్లలతో కూడా చేయిస్తున్నాను. దయచేసి ఇలాంటి సమయంలో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపండి. పిల్లలకు మంచి మంచి విషయాలు చెబుతూ ధైర్యం చెప్పండి. వారి పని వారు చేసుకునేలా తీర్చిదిద్దండి. భవిష్యత్తుపై ఓ నమ్మకం ఏర్పరచండి’ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ‘తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటే ఈ కరోనా ఏం చేయదు. దయచేసి రూమర్స్‌ను నమ్మకండి, నెగిటవ్‌ వీడియోలు ఎక్కువగా చూడకండి. పాజిటివ్‌గా ఉండండి. కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఇమ్యూనిటీని పెంచుకోండి. రోగనిరోధక శక్తికి నేనిచ్చే బెస్ట్‌ సలహా ప్రాణాయామం. తప్పకుండా చేయండి. ఇక నేను ఫోన్‌ చేసిన వారిలో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి పెద్దలే ప్యానిక్‌ అవ్వడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు’ అని ఆయన పేర్కొన్నారు.

ఇలా అందరికీ ధైర్యం చెప్పి అతనే కరోనాతో చనిపోవడం అందరినీ కదిలిస్తుంది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, జర్నలిస్టులు అతని ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss