Monday, May 10, 2021

Latest Posts

ఏ.పి ప్రభుత్వానికి మూడు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు ఎందుకంటే….

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు పంచాయతీ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పోలిన రంగులను వెంటనే తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కానీ రంగులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 వారాల గడువు కోరగా, హైకోర్టు దీనికి అంగీకరించి 3 వారాల గడువిచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీ జెండా పోలిన రంగులు వేస్తున్నట్లు పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఖచ్చితంగా రంగులు తొలగించాలని ఆదేశించింది.  అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో, దీనిపై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. రంగులు తొలగించేందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss