ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 5487 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 66121 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 7210 మందిగా పేర్కొంది. గడచిన 24 గంటల్లో 37 మంది కోవిడ్ బారిన పడి చనిపోగా ఇప్పటివరకు వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 5745 కు చేరింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 6,81,161 మంది కరోనా బారిన పడగా 6,12,300 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం జరిగింది. ప్రస్తుతం యాక్టివ్ ఉన్న చికిత్స్య పొందుతున్న వారి సంఖ్య 63,116 గా ఉంది. కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56,66,323 శాంపిల్స్ ను పరీక్షించడం జరిగింది.