ఎంతో సేవాతత్పరతతో కూడిన నర్సింగ్ వృత్తికి, ఆధునిక నర్సింగ్ విద్యకు “లేడీ విత్ ద ల్యాంప్” పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతినొందిన “ఫ్లోరెన్స్ నైటింగేల్” ఆద్యురాలు, మార్గదర్శకురాలు, స్ఫూర్తి ప్రధాత.1820 మే 12 ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో బ్రిటీష్ కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగిల్ నర్సు వృత్తికి స్పూర్తిదాయకంగా నిలిచినందుకు ప్రపంచ వ్యాప్తంగా మే 12న ఆమె జయంతిని నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
నవజాత శిశువు భూమిమీద అడుగిడే సమయంలో పురిటి నొప్పులు పడుతున్న తల్లిని ఓదారుస్తూ బాసటగా ఉంటూ జన్మ, పునర్జన్మల వారథిగా నిలుస్తూ మనిషి పుట్టుక మొదలు , శారీరర, మానసిక రుగ్మతలతో, గాయాలతో వైద్యశాలలో ఆశ్రయం పొందినప్పుడు ఔదార్యంతో వేళకు ఔషదాలను అందిస్తూ, బాధ్యతతో జాగ్రత్తలు చెబుతూ,ఓర్పుతో పరిచర్యలు చేస్తూ మనసును కుదుట పరిచేమంచిమాటలతో రోగిలో స్పూర్తిని, నమ్మకాన్ని పెంపొందిస్తూ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే దిశగా డాక్టరుతోపాటు అంతకంటే ఎక్కువ పాళ్లే రోగికి ప్రత్యక్షంగా సేవలను అందించే ఉన్నతమైన, ఔదార్యమైనది, సేవా పూర్వకమైనది నర్సు వృత్తి. అటువంటి నర్సులను సమాజంలో గౌరవిద్దాము.
ఇది కూడా చదవండి: ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ అవార్డు గెలుచుకున్న సానియా మీర్జా